నీలిమ హాస్పిట‌ల్ లో దేవునూర్ గ్రామ‌స్తుల‌కు ఉచిత వైద్యం

by Ratna Kumari |

ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామస్తుల‌కు ఇచ్చిన హామీని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలబెట్టుకున్నారు.

నీలిమ హాస్పిట‌ల్ లో దేవునూర్ గ్రామ‌స్తుల‌కు ఉచిత వైద్యం
X

దిశ, దర్మసాగర్ : ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామస్తుల‌కు ఇచ్చిన హామీని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవునూర్ గ్రామస్థులకు తన నీలిమ హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందిస్థానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం దేవునూర్ గ్రామస్థులు స్థానిక సర్పంచ్ హింగే రవి, నాయకులు గుడి వేనుక దేవేందర్ ఆధ్వర్యంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా దేవునూర్ గ్రామానికి చెందిన ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా నీలిమ హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం చేసుకోవచ్చని సూచించారు. అలాగే దేవునూర్ గ్రామానికి గత 2సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సమస్య ను ఎమ్మెల్యే కు వివరించగా.. హనుమకొండ రీజినల్ మేనేజర్ తో చారవాణి లో మాట్లాడి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా హనుమకొండ రీజినల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన దేవునూర్ గ్రామస్థులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story