- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
మండలంలోని గట్టుపల్లిలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలో గంజాయి విక్రయించడానికి సిద్ధం చేస్తుండగా పక్క సమాచారం మేరకు ఆకస్మికతనికి చేపట్టిన పోలీసులకు నిషేధిత గంజాయి ప్యాకెట్లతో స్మగ్లింకు పాల్పడుతున్న నలుగురు యువకులను శుక్రవారం అరెస్టు చేసినట్లు కాటారం డిఎస్పి సూర్యనారాయణ తెలిపారు.

నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
1.230 కేజీల గంజాయి స్వాధీనం, కేసు నమోదు
దిశ, మల్హర్: మండలంలోని గట్టుపల్లిలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలో గంజాయి విక్రయించడానికి సిద్ధం చేస్తుండగా పక్క సమాచారం మేరకు ఆకస్మికతనికి చేపట్టిన పోలీసులకు నిషేధిత గంజాయి ప్యాకెట్లతో స్మగ్లింకు పాల్పడుతున్న నలుగురు యువకులను శుక్రవారం అరెస్టు చేసినట్లు కాటారం డిఎస్పి సూర్యనారాయణ తెలిపారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ కేసు వివరాలను వివరించారు.
గత కొంత కాలంగా కొయ్యూరు గ్రామానికి చెందిన యాదాండ్ల నవదీప్, కొండపేట గ్రామానికి చెందిన కంపల్లి సాయికుమార్, మల్లారం గ్రామానికి చెందిన భూక్య రాజు, అజారుద్దీన్ అనే నలుగురు యువకులు సేవించుటకు అలవాటు పడి, ఇట్టి గంజాయిని మొదటి ఇద్దరు నిందితులు గత నెల 14న ఓడిషా లోని మారుమూల ప్రాంతం అయిన మోటు అనే గ్రామనికి బస్సు లో వెళ్లి అక్కడ నుండి గంజాయి ని తక్కువ ధర కు కొనుగోలు చేసి తీసుకొచ్చిన ఆ గంజాయిలో కొంత సేవించి మిగిలిన గంజాయిని మరో ఇద్దరు వ్యక్తుల ద్వార చిన్న చిన్న పాలితిన్ కవర్ లలో 100గ్రాములు నింపి ఒక్క దాన్ని రూ.5వందల చొప్పుల విక్రయిస్తూ వచ్చే డబ్బులతో జలశాలకు అలవాటు పడి గంజాయి తాగే అలవాటు ఉన్న చుట్టుపక్క గ్రామాలలోని వ్యక్తులకు అధిక ధరకు అమ్మించి డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకొని కంటిన్యూ చేస్తున్న వీరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.అట్టి గంజాయిని తూకం వేయగా 1.230 కేజి గ్రాముల గంజాయి విలువ రూ.61.5 వందల గంజాయిని, ఒక మొబైల్ ఫోన్ను నిందితుల వద్ద స్వాదిన పర్చుకొని నిందితులని అదుపులో తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సిఐ నాగార్జున రావు, కొయ్యూరు ఎస్సైలు నరేష్, రాజన్ కుమార్ తోపాటు పోలీస్ సిబ్బంది వీరిని డిఎస్పి అభినందించారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కి బానిస అయి వారి విలువైన భవిష్యత్తుని పాడు చేసుకోవడద్ధని, ఈ విధంగా డ్రగ్స్ కి బానిస అయి నేరాలకు పాల్పడితే కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్చరించారు.






