- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాచార కేసులో నలుగురు అరెస్ట్
మండలంలోని ములకనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనలో పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

X
దిశ, భీమదేవరపల్లి : మండలంలోని ములకనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనలో పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టుబడిన వారిలో మల్లారం గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు పెద్దవేన శివకుమార్‌తో పాటు పిట్టల మణికంఠ, నాగిళ్ల వేణు, నాగిళ్ల గణేష్ (టోనీ) ఉన్నారు. నిందితులను ఎల్కతుర్తి జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఘటనలో ఉపయోగించిన ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, సిఐ పులి రమేష్, ఎస్‌ఐ రాజు పాల్గొన్నారు.
Next Story






