- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు వారెంట్ ఉల్లంఘించిన నలుగురు నిందితులు అరెస్ట్
కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పరారీలో ఉన్న నలుగురు నిందితులను గీసుకొండ పోలీసులు అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేసి శుక్రవారం రిమాండ్ కి తరలించారు.

దిశ, గీసుగొండ : కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పరారీలో ఉన్న నలుగురు నిందితులను గీసుకొండ పోలీసులు అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేసి శుక్రవారం రిమాండ్ కి తరలించారు. సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. నందనాయక్ తండాకు చెందిన బాదావత్ రవి పై 2019లో, అగ్రహం పహాడ్ కి చెందిన మాదాసి కుమారస్వామి పై ఆత్మకూర్ లో 2023లో, సిరబోయిన రాజు ఈస్ట్ పోర్ట్ వరంత్ 2016లో, తిమ్మంపేటకి చెందిన ఆల్దొండ కరుణాకర్ దుగ్గొండి 2023లో కేసులు నమోదయ్యాయి. వరంగల్ జెఎఫ్‌సీఎం కోర్టులో విచారణలో ఉన్న కేసుల్లో వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చట్టాన్ని, కోర్టు ఆదేశాలను గౌరవించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కోర్టు వారెంట్లు ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు.






