- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికలు పెట్టే చిత్తశుద్ధి అధికార పార్టీకి లేదు
కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే చిత్తశుద్ధి లేదని, అందుకే కాలయాపన చేసిందని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు

దిశ, భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే చిత్తశుద్ధి లేదని, అందుకే కాలయాపన చేసిందని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ రెడ్డి విమర్శించారు. భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. కానీ 660 రోజులు అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు. కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారని గుర్తు చేశారు. ఎన్నికలు పెట్టాలంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు బయపడుతున్నారని ఎద్దేవా చేశౄరు. ఈ సమావేశంలో ఆయనతోపాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






