మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చల్లా పరామర్శ

by Nallavelli.Anjaneyulu |

మండలంలోని మరియాపురం, గంగదేవిపల్లి గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన రగుసాల మల్లయ్య, పెంతల కొమురయ్య, గూడ సంతోష్ కుమార్ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చల్లా పరామర్శ
X

దిశ, గీసుకొండ : మండలంలోని మరియాపురం, గంగదేవిపల్లి గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన రగుసాల మల్లయ్య, పెంతల కొమురయ్య, గూడ సంతోష్ కుమార్ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన కార్యకర్తల కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. వారి కుటుంబాలను ఆదుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావ్, నాయకులు బోడకుంట్ల ప్రకాశ్, ముంత రాజయ్య, కంబాల కోటి, చల్లా రాజు, రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story