- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మ ఆడిన విదేశీ సుందరీ మణులు
హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఆనందోత్సాహాలతో మార్మోగింది. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హెరిటేజ్ టూర్ లో భాగంగా బుధవారం హన్మకొండ, వరంగల్ పర్యటనకై సందర్శిస్తున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బతుకమ్మ పండుగ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

దిశ, హనుమకొండ : హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఆనందోత్సాహాలతో మార్మోగింది. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హెరిటేజ్ టూర్ లో భాగంగా బుధవారం హన్మకొండ, వరంగల్ పర్యటనకై సందర్శిస్తున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బతుకమ్మ పండుగ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి ప్రత్యేకతను ఆస్వాదిస్తూ స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మలతో ఆట పాటలాడారు. విదేశీ అతిథులను హరిత కాకతీయ హోటల్ వద్ద హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇతర అధికారులు స్వాగతించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళల చీరల వేషధారణ, బతుకమ్మ కళ, సంప్రదాయం విదేశీ సుందరీమణులను మంత్రముగ్ధులను చేసింది.
దేశాధినేతల స్థాయిలో ఏర్పాటైన ఈ స్వాగత కార్యక్రమం స్థానిక ప్రజల్ని, సందర్శకుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతిలోని మహిళా పరంపర, బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమం ఒక మంచి అవకాశంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. అలాగే.. హన్మకొండ లోని వెయ్యి స్తంభాల ఆలయం చేరుకున్న సుందరీమణుల కు స్వాగత గీతం తో ఆహ్వానం పలికారు చిన్నారులు...






