క్షణికావేశంతో యువప్రేమికుడి బలవన్మరణం

by Nallavelli.Anjaneyulu |

ఏడాదిగా ప్రేమించుకున్న వారిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన ప్రియుడి పాలిట యమ పాశమైంది. తక్షణమే పెళ్లి చేసుకుందామని ప్రియుడు పట్టుబట్టడం.. పరీక్షలు అయ్యాకా చేసుకుందామని ప్రియురాలు అనటంతో క్షణికావేశానికి లోనై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

క్షణికావేశంతో యువప్రేమికుడి బలవన్మరణం
X

దిశ, మరిపెడ(కురవి) : ఏడాదిగా ప్రేమించుకున్న వారిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన ప్రియుడి పాలిట యమ పాశమైంది. తక్షణమే పెళ్లి చేసుకుందామని ప్రియుడు పట్టుబట్టడం.. పరీక్షలు అయ్యాకా చేసుకుందామని ప్రియురాలు అనటంతో క్షణికావేశానికి లోనై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండల కేంద్రానికి చెందిన శశి కుమార్ (21) తండ్రి చిన్ననాడే మరణించటంతో పేయింటర్ పని చేసుకుంటూ తల్లి ఇద్దరు సోదరులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏడాది క్రితం మహబూబాబాద్ బస్టాండ్ లో కేసముద్రం మండలానికి చెందిన ఓ యువతి(19)తో పరిచయం ఏర్పడింది.

సదరు యువతి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో ఓకేషనల్ ఇంటర్ సెకండ్ ఈయర్ చదువుతోంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారగా.. ఏడాదిగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే మంగళవారం ప్రియుడు వెంటనే పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి తీసుకురాగా.. ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయని, అయిపోగానే చేసుకుందామని కరాకండిగా చెప్పేసింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంటికి తిరిగి వచ్చి క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు సాయి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story