ప్రశాంతంగా ముగిసిన మత్స్య సహకార ఎన్నికలు

by S Gopi |

హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకొడపాక మత్స సహకార సంఘం ఎన్నికలు... For elections

ప్రశాంతంగా ముగిసిన మత్స్య సహకార ఎన్నికలు
X

దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకొడపాక మత్స సహకార సంఘం ఎన్నికలు నిర్వహించగా 12 గ్రామాలలోని మత్స్యకారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సహకార సంఘ ఎన్నికల అధికారి విజయ్ మాట్లాడుతూ ఈరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగగా 1160 మత్స్య సహకార సంఘంలో ఓటర్లుగా ఉన్న 860 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలలో 39 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి 7 గంటల వరకు గెలుపొందిన అభ్యర్థి పేరు ఖరారు చేస్తామని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరకాల ఏసీపీ శివరామయ్య ఆధ్వర్యంలో శాయంపేట ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు పోలీసులు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరగడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తుది ఫలితం గురించి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

Next Story