- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
మండల కేంద్రంలో ఉన్న ట్రైబల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ డిమాండ్ చేశారు.

దిశ, ఏటూరునాగారం : మండల కేంద్రంలో ఉన్న ట్రైబల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఏరియా హాస్పిటల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోజనం పూర్తి స్థాయిలో విద్యార్థులకు పెట్టక ఉడికి ఉడకని భోజన సదుపాయాలు మురిగిపోయిన ఉల్లిగడ్డ, టమాటా, పప్పు ఇటువంటి సరుకులు వండి పెట్టడం వల్ల విద్యార్థులకు ప్రాణ హానీ జరిగే అవకాశాలు ఉందన్నారు. దీనికి సంబంధించి ఫుడ్ కమిషనర్ ఐటీడీఏ అధికారులు స్పందించాలన్నారు. అలాగే వారానికి ఒక రోజు అధికారులు స్పందించి విద్యార్థులతో భోజనం చేయాలి. ఇలా నిర్లక్ష్యం ఉండటం వల్లనే విద్యార్థులకు ఉడికి ఉడకని భోజనం పెట్టే పరిస్థితి కనపడుతుంది. జిల్లాలోని గిరిజన పాఠశాల అన్ని సర్వేలు చేసి ఆ సర్వేలో భాగంగా సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు. లేని పక్షంలో గిరిజన విద్యార్థులు అంతా ఏకం చేసుకుని భవిష్యత్తులో పోరాటం చేస్తానని సందర్భంగా హెచ్చరిస్తున్నామని తెలిపారు.






