- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ పై అత్యాచారం కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
మహిళ పై అత్యాచారం కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది.

దిశ, భూపలపల్లి ప్రతినిధి : మహిళ పై అత్యాచారం కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. 2020 సెప్టెంబర్ 06న మహముత్తారం మండలానికి చెందిన మహిళ కాటారంలోని శ్రీలక్ష్మీనరసింహ ఆసుపత్రిలో శిక్షణకు వెళ్లి తిరిగి తన గ్రామానికి వెళ్లేందుకు సాయంత్రం సమయంలో కాటారం ఆటో స్టాండ్ వద్ద టాటా మేజిక్ ఎక్కింది. ఆటో డ్రైవర్ గుగులోతు వినోద్ అలియాస్ వినయ్ కుమార్(24) భూపాలపల్లి ఆమెను గమ్య స్థానానికి తీసుకెళ్లకుండా కాటారం శివారులోని కొత్తపెల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా.. బాధితురాలు ప్రతిఘటించినప్పటికీ ఆమెను చంపుతానని బెదిరించాడు. సెప్టెంబర్ 27, 2020న కాటారం సెంటర్ లో వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలు అదేరోజు కాటారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై సాంబమూర్తి కేసునమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జీ షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణ అనంతరం ఏఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ ఎం.సంపత్ రెడ్డి సాక్షులను సమర్పించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.డీ. రఫీ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిపై నేరం రుజువు అయింది. దీంతో న్యాయమూర్తి నాగరాజు నిందితునికి ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడేలా సమగ్ర దర్యాప్తు చేసిన అధికారులను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అభినందించారు.






