ఐదుగురు మావోయిస్టులు లొంగింపు

by Bhanu |

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో సభ్యులుగా పనిచేసిన ఐదుగురు వ్యక్తులు ములుగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శబరేష్ ఎదుట బుధవారం లొంగిపోయారు.

ఐదుగురు మావోయిస్టులు లొంగింపు
X

దిశ, ములుగు ప్రతినిధి: నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో సభ్యులుగా పనిచేసిన ఐదుగురు వ్యక్తులు ములుగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శబరేష్ ఎదుట బుధవారం లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన "పోరు కన్నా ఊరు మిన్న" కార్యక్రమానికి స్పందనగా జనజీవన స్రవంతిలో కలిసేందుకు మావోయిస్టులు మొగ్గు చూపారు. లొంగిపోయిన వారిలో మడావి భీమా, మడావి కోస, మడివి భీమా (డీకే ఏఎంఎస్), వెంజెం ఊర మరియు వెంజెం హెంగి లు ఉన్నారు. వీరంతా కోమటిపల్లి ఆర్పిసి కి చెందినవారు. వీరు గతంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అనేక నేరపూరిత కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రేష్ఠమైన సరెండర్ పాలసీ కింద, వీరికి 24 గంటల్లోపే నగదు సహాయం, వైద్య సదుపాయాలు, పునరావాసం వంటి సహాయాలు అందించబడతాయి అని,తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్న ద్వారా ఇప్పటివరకు మొత్తం 47 మంది మావోయిస్టులు ములుగు జిల్లాలో లొంగిపోయారు అని, ఈ సంఖ్యలో డి వి సి ఎం - 1, ఏ సి ఎం - 6, పీఎం - 11, ఇతర కమిటీలకు చెందిన 28 మంది సభ్యులు ఉన్నారు అని,అజ్ఞాతంగా ఉన్న మావోయిస్టులు శాంతియుత జీవితానికి తిరిగివచ్చే అవకాశాన్ని వినియోగించుకోవాల తెలిపారు. లొంగిపోయిన వారికి వారికి రూ. 25,000 చొప్పున తక్షణ సహాయం అందించారు.




Next Story