- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ఐదుగురు అరెస్ట్...
కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న నిందితులపై గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

దిశ, గీసుగొండ: కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న నిందితులపై గీసుగొండ పోలీసులు ప్రత్యేక గాలింపు నిర్వహించి నాన్ బెయిలబుల్ జారీ అయిన రెండు వేర్వేరు కేసులకు సంబంధించి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం... గీసుగొండ స్టేషన్ లో నమోదైన క్రైం నం. 305/2022 కేసులో సింగిరెడ్డి బిక్షపతి, సింగిరెడ్డి రమేశ్, కుసం రాజారం అనే ముగ్గురిని, క్రైం నం. 87/2020 కేసులో బనోతు ఎర్యా, బొంతా శివకుమార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గంగదేవిపల్లి, జాన్పాక గ్రామాలకు చెందినవారు. నిందితులు కోర్టు విచారణకు గైర్హాజరవడంతో కోర్టు వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. స్టేషన్ పరిధిలో ఇలాంటి వారిపై చర్యలు కొనసాగుతాయని, కోర్టు ఆదేశాలు తప్పక పాటించాలని హెచ్చరించారు.






