కెనరా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు

by Kodari Anjali |

జనగామ పట్టణంలోని బాలాజీ నగర్‌లో ఉన్న కెనరా బ్యాంక్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

కెనరా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు
X

దిశ, జనగామ: జనగామ పట్టణంలోని బాలాజీ నగర్‌లో ఉన్న కెనరా బ్యాంక్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బ్యాంక్ లాకర్ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొన్ని మైనర్ డాక్యుమెంట్లు దగ్ధమైనట్లు సమాచారం. బ్యాంకు ఆవరణ మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ప్రత్యేక పరికరాల సహాయంతో బ్యాంకులో పేరుకుపోయిన పొగను బయటకు పంపిస్తూ పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిస్థితిని సమీక్షించారు. అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు, జరిగిన ఆస్తి నష్టంపై అధికారులు విచారణ చేపట్టారు.

Next Story