- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాటరాయుళ్ల అరెస్ట్.. నగదు, మొబైల్ స్వాధీనం
మూడు కార్డుల జూదం ఆడుతున్న వారిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.

దిశ, సదాశివ నగర్: సదాశివ నగర్ మండలంలోని కుప్రియాల్ శివారులో మూడు కార్డుల జూదం ఆడుతున్నట్లు పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో విశ్వాసనీయ సమాచారం మేరకు సదాశివనగర్ పోలీస్ సిబ్బంది కుప్రియాల్ శివారులోని మంగలిగుట్ట సమీపంలో జూదం ఆడుతున్నట్లు పక్క సమాచారంతో ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు పేకాట ఆడుతున్నట్లు గుర్తించగా, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, రూ 2,380 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. ఈ ఘటనపై సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. ఎస్సై పుష్పరాజు మాట్లాడుతూ... జూదం చట్ట విరుద్ధమైన నేరం. ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని , అనుమానదాస్పద లేదా చట్ట విరుద్ధమైన కార్యకలాపాల గురించి సమీప పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు. ఎస్సై సిబ్బందిని అభినందించారు.






