కోర్టు ఆదేశాలు, మున్సిపల్ పర్మిషన్ లేకుండా జడ్చర్లలో అక్రమ కట్టడాలు

by Kodari Anjali |

కోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కోర్టు ఆదేశాలు, మున్సిపల్ పర్మిషన్ లేకుండా జడ్చర్లలో అక్రమ కట్టడాలు
X

దిశ, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ 12వ వార్డు, గాంధీ ట్రస్ట్, సర్వే నెం. 67 లో హైకోర్టు తేదీ 07-07-2026 నాటి ఆదేశాలను ధిక్కరించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఈ స్థలంలో నిర్మాణం చేపట్టవద్దని స్పష్టంగా ఆదేశించినప్పటికీ, అక్కడ నిర్మాణ పనులు మున్సిపల్ కమిషనర్ అనుమతి లేకుండానే ఈ కట్టడాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్ మున్సిపల్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి గాంధీ ట్రస్ట్‌లోని అక్రమ కట్టడాలపై సమగ్ర విచారణ జరిపి ఆపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ, ప్రజా ఆస్తులను కాపాడవలసిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా? లేక లంచగొండితనమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలు, ఎమ్మెల్యే లేఖ ఉన్నప్పటికీ అక్రమ కట్టడాలు ఆగకపోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజలే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Next Story