- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీసీఎస్ మతమార్పిడి కేసులో ట్విస్ట్.. నిందితురాలు నిదాఖాన్‌కు బెయిల్ మంజూరు
మహారాష్ట్రలోని టీసీఎస్ (TCS) మతమార్పిడి కేసులో నాసిక్ కోర్టు కీలక తీర్పునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ (TCS) ఉద్యోగుల బలవంతపు మతమార్పిడి కేసులో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా కోర్టు (Nasik District Court) కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నిదాఖాన్ (Nida Khan)కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్ ఆర్డర్ ఇస్తున్న సమయంలో గౌరవ న్యాయమూర్తి భగవద్గీతలోని శ్రీకృష్ణుడి బోధనలను, సత్యం, ధర్మం యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. సత్యం, న్యాయం, ధర్మం అనేవి కాలంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ నిలిచివుంటాయని తెలిపారు. శ్రీకృష్ణుడు బోధించినట్లుగా, తాత్కాలికంగా ఏవైనా అడ్డంకులు ఎదురైనప్పటికీ, అంతిమంగా సత్యమే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. చట్టం ముందు అంతా సమానులేనని, పూర్తి విచారణ జరగకుండా ఎవరినీ దోషులుగా ముద్ర వేయలేమనిని న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు..
షరతులతో కూడిన బెయిల్..
అయితే, నిందితురాల నిదాఖాన్‌కు బెయిల్ (Bail) ఇచ్చినప్పటికీ కోర్టు పలు కఠినమైన షరతులను విధించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, సాక్షులను బెదిరించేందుకు ప్రయత్నం చేయవద్దని ఆదేశించింది. అలాగే, ఈ కేసు పరిధి ముగిసే వరకు పోలీసుల అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లరాదని కోర్టు స్పష్టం చేసింది.






