ఏపీలో దారుణం.. చోరీ చేసి ఇంటికి నిప్పంటించిన దుండగులు

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో చోరీ చేసిన దుండగులు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ఇంటికి నిప్పింటించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటు చేసుకుంది.

ఏపీలో దారుణం.. చోరీ చేసి ఇంటికి నిప్పంటించిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో చోరీ చేసిన దుండగులు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ఇంటికి నిప్పింటించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటు చేసుకుంది. రైల్వేలో పాంచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఉమాదేవి భర్త మరణించడం, పిల్లలు చదువుల కోసం వేరే ఊరిలో ఉండటంతో ఒంటరిగానే ఉంటోంది. అయితే బుధవారం యతావిధిగా రాజేశ్వరి ఇంటికి తాళం వేసి ఉద్యోగానికి వెళ్లింది. అప్పటికే ఇంటిపై కన్నేసిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.

ఇంట్లో ఉన్న 25 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి, రూ.20వేల నగలు ఎత్తుకుపోయారు. అక్కడితో ఆగకుండా అనుమానం రాకుండా ఇంటికి నిప్పు పెట్టి వెళ్లిపోయారు. తెల్లవారుజామున ఇంటి నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. అప్పటికే ఇంట్లోని విలువైన డాక్యుమెంట్లు, దుస్తులు అన్ని బూడిదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story