- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుది విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్ దివాకర టీఎస్
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : తుది విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : తుది విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. మూడో దశ ఎన్నికలు ఈనెల 17న జరుగనున్నాయి. ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి చేసినట్లు తెలిపారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో మూడవ విడతలో ఎన్నికలు జరుగనున్న కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల పోలింగ్ సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ సమక్షంలో కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేశామని, స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేయడం జరిగింది అని వివరించారు. ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.






