- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జాతీయ రహదారి 163 పై ధ్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కోట్టిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నెలకొంది.

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జాతీయ రహదారి 163 పై ధ్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కోట్టిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..నూగూరు వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన రవి కిరణ్(32), రవి శంకర్(35) ఇద్దరు వ్యక్తులు మేడారం సమ్మక్క సారలమ్మ అలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకుని తిరిగి బర్లగూడెంకు ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఏటూరునాగారం నుండి రొయ్యూరు వెళ్లె జాతీయ రహదారి 163 రెండవ బ్రిడ్జి వద్ద వెంకటాపురం వైపు నుండి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రవికిరణ్ అక్కడికక్కడే మృతి చెందిగా తీవ్ర గాయాలపాలైన రవి శంకర్ ను కుటుంబ సభ్యులు ఆటోలో స్థానిక ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అయితే ద్వచిక్ర వాహానాన్ని ఢీ కొట్టిన లారీని లారి డ్రైవర్ అక్కడే విడచి పారిపోయాడు. ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






