- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు కాళ్లు పట్టుకోవడం కాదు.. కాలర్ పట్టుకోవాలి : కేటీఆర్
వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని.. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కథం తొక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని.. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కథం తొక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ లో జరిగిన రైతు సంగ్రామ సదస్సు లో బుధవారం పాల్గొని ఆయన మాట్లాడారు. వరంగల్‌లో ఏం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్నారు. వరంగల్‌లో పోరాటాల విల్లు ఎక్కుపెడితే.. ద్రోహుల గుండె జల్లు మంటుందన్నారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద దొంగలు అని.. రాహుల్ వరంగల్ డిక్లరేషన్ సభ పెట్టి దొంగ హామీలు ఇచ్చారన్నారు. ఇవాళ్టితో కాంగ్రెస్ నయవంచనకు నాలుగేళ్లు నిండాయన్నారు. రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్.. రైతు డిక్లరేషన్‌లో 34 హామీలు ఇచ్చారన్నారు.
ఇచ్చిన 34 హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బాండ్ పేపర్లు రాసి కాకమ్మ కథలు చెప్పారు. రైతులు దొంగ హామీలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. రెండున్నరేళ్లు పూర్తైనా రైతు డిక్లరేషన్ ఊసే లేదన్నారు. ఎకరానికి రూ. 15 వేలు ఎందుకు ఇవ్వట్లేదని.. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? అని ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. అన్ని పంటలను బోనస్ ఇచ్చి కొంటామన్నారు. కౌలు రైతుకు ఎకరానికి రూ. 14 వేలు వస్తుందా అని ప్రశ్నించారు. పంట బీమా పథకం ఎక్కడికి పోయింది..? అసైన్డ్ భూములకు పట్టాలు ఎప్పుడిస్తారన్నారు. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం అన్నారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారన్నారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్, రేవంత్ ఎక్కడికి పోయారన్నారు. దుక్కి దున్నే రైతులను దారుణంగా వంచించారన్నారు. కాంగ్రెస్‌ది మెగా రైతు మేళా కాదు.. దగా రైతు మేళా అన్నారు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అన్నారు. నాట్లేసే టైమ్‌కు కేసీఆర్ రైతుబంధు పడేదన్నారు. కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అందరూ కాపీ కొట్టారన్నారు. రైతులు పెట్టుబడి సాయం కోసం అప్పుల పాలయ్యేవారన్నారు. రైతులకు 11 విడతలుగా రూ. 73 వేల కోట్లు ఇచ్చారన్నారు. కేసీఆర్ సర్పంచ్ ఎన్నికల ముందు ఓట్ల కోసం ఒక్కసారే రైతు భరోసా ఇచ్చారన్నారు. డిక్లరేషన్ అమలుకు రైతులు కాంగ్రెస్‌ను గల్లా పట్టి నిలదీయాలన్నారు. ఎన్నికల తర్వాత రుణమాఫీ ఎగబెట్టాడన్నారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ వచ్చి భద్రకాళి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని చెప్పారు.
రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ ఊరికైనా వెళ్లి అడుగుదాం.. ఒక్క ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ జరిగిందంటే రాజీనామా చేస్తాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ చారానా.. టోపీ బారానా అన్నారు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల్లో పురుగుల మందు తాగారన్నారు. కాంగ్రెస్ పాలనలో దందాలు, కమీషన్లు, కొట్లాటలు రైతులు, ప్రజల గురించి పట్టించుకునే వాళ్లు లేరన్నారు. రైతులకు ఇవ్వడానికి పైసలు లేవన్నారు. రాహుల్‌కు మాత్రం పైసల మూటలు పంపుతున్నారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులను నెంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. ఆగమైన తెలంగాణను బాగు చేసింది బీఆర్‌ఎస్ నే నన్నారు. రైతు ప్రగతికి అద్భుతమైన పథకాలు కేసీఆర్ తెచ్చారన్నారు. కేసీఆర్ కంటే రైతును బాగా చూసుకున్న నాయకుడు దేశంలో లేరన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామన్నారు. పదేళ్లలో రైతులకు రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో సాగు పెరిగి వరంగల్‌లో భూముల రేట్లు పెరిగాయన్నారు. కాంగ్రెస్ వచ్చాక భూముల ధరలు పడిపోయాయన్నారు. ధాన్యం కొనుగోలు కోసం వానల్లో, ఎండల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. లక్షెట్టిపేట కొనుగోలు కేంద్రంలో గోడ కూలి నలుగురు రైతులు చనిపోయారన్నారు. కాంగ్రెస్ పాలనలో వెనకటి రోజులు మళ్లీ వచ్చాయన్నారు.
కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్‌ది అని అన్నారు. ఇసుక కోసం పొలాలకు నీళ్లు ఇచ్చే చెక్‌డ్యామ్‌లు పేలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు వెంటనే యాప్‌లు బంద్ చేసి షాపుల్లో యూరియా అందించాలన్నారు. పైసల బస్తాలు మోసే రేవంత్‌కు యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదన్నారు. కాంగ్రెస్ ఇస్తామన్న బోనస్ బోగస్ అయ్యింది. కష్టపడి పండించిన మక్కలు, జొన్నలు కొనట్లేదన్నారు. రైతులు కాళ్లు పట్టుకోవడం మానేసి కాలర్ పట్టుకోవాలని పిలుపు నిచ్చారు. మక్కలు వెంటనే కొనకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కలవుతుందన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టమంటే ప్రాణం పోయినా పెట్టమన్నారన్నారు. రేవంత్ రెడ్డి మీటర్లు పెడతామని ఒప్పుకున్నారన్నారు. రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలి కావద్దు.. రైతులు గుండె ధైర్యం కోల్పోవద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. రాబంధు రాజ్యం పోయి రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుందన్నారు. రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన నాలుగు తీర్మానాలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ రాబంధు పాలనలో 1000 మందికి పైగా రైతులు చనిపోయారు. రోడ్డున పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 34 హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలను ఆంక్షలు లేకుండా రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని బాకీతో సహా రైతులకు చెల్లించాలన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తికాని రైతులకు రుణ విముక్తి కల్పించాలన్నారు. కేసీఆర్ తెచ్చిన రైతు బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు.






