- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి : కలెక్టర్ సత్యశారద
రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ సత్య శారద పేర్కొన్నారు.

దిశ, పర్వతగిరి : రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ సత్య శారద పేర్కొన్నారు. బుధవారం రాయపర్తి, వర్థన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్, వరి మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. రైతులకు అందిస్తున్నన సౌకర్యాలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం పరీక్షలు, గన్నీ బ్యాగుల లభ్యత, ధాన్యం నిల్వలు, రవాణా ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు చెల్లింపులు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, కూర్చునే సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వర్ధన్నపేటలోని వీరభద్ర రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ధాన్యాన్ని దించుకోవాలని రైస్ మిల్లర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో సుమ, తహశీల్దార్ విజయ్ సాగర్, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సివిల్ సప్లై సంధ్యారాణి సంబంధిత ఎంపీడీవోలు






