ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాలి

by Taduka Kalyani |

వాతావరణ శాఖ సూచన మేరకు ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాలి
X

దిశ, మహదేవపూర్ : వాతావరణ శాఖ సూచన మేరకు ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం మహాదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ హసీనా భాను అధ్యక్షతన జరిగిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం జిల్లాలో 4,6,8,10 తేదీలలో అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో గ్రామసభలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో విజయవంతంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పూర్తి ప్రణాళిక బద్దంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాలలో ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు వివరించినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని కూడా తీసుకుంటున్నామని తెలిపారు. వాతావరణ శాఖ సూచన మేరకు ఎల్ నినో ప్రభావం ఉన్నందున వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారం రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని రైతులు సహకరించాలని తెలిపారు. వాతావరణ శాఖ సలహాలు సూచనలు పాటించడం వల్ల వ్యవసాయంలో మెళకువలు పాటించాలని తెలిపారు.

నానో యూరియా వలన తక్కువ మోతాదులో ఎక్కువ దిగుబడి

అలాగే అధికంగా యూరియా వినియోగించకుండా నానో యూరియా వినియోగించేలా రైతులకు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నానో యూరియా వలన తక్కువ మోతాదులో ఎక్కువ దిగుబడి వస్తుందని తెలిపారు. ఎన్నికల సంగం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు సవరణ జూన్ 15 నుండి జరుగుతున్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జరిగిందని ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి బూతు స్తాయి అధికారులు వస్తారని ఓటర్లు వివరాలను ఇవ్వాలని తెలిపారు. ఓటరు జాబితాలో ఏవైనా సలహాలు సూచనలు అభ్యంతరాలు ఉన్నట్లయితే తహసిల్దార్ కు లిఖితపూర్వకంగా అందజేయాలని తెలిపారు. మీ సమస్యలను ఆయా శాఖల అధికారులు దృష్టికి తీసుకెళ్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వృత్తి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నమని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పై మరింత ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు యంత్రాంగం సహకారంతో సంక్షేమ పథకాలు అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఆర్డీఓ రవీందర్, తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో రవీంద్రనాథ్, వ్యవసాయ శాఖ ఏడిఎ శ్రీ పాల్, సిడిపిఓ రాధిక, పిఆర్ డిఈ సాయిలు, వైద్యాధికారి సుష్మిత, అటవీశాఖ ఎఫ్డిఓ రవి, విద్యుత్, ఇతర శాఖల అధికారులు వైస్ సర్పంచ్ శిరీష, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story