మొన్న పులి.. నేడు ఎలుగుబంటి : భయాందోళనలో రైతులు

by Batti.Sumithra |   (  Updated:2026-03-11 06:03:15  IST  )

కంచనపల్లి గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున ఎలుగుబంటి సంచరించినట్లు స్థానికులు తెలిపారు.

మొన్న పులి.. నేడు ఎలుగుబంటి : భయాందోళనలో రైతులు
X

దిశ, రఘునాథపల్లి : మండలంలోని కంచనపల్లి గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున ఎలుగుబంటి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. మొక్కజొన్న చేనుల్లోకి ఎలుగుబంటి వెళ్లినట్లు తెలిసింది. మొన్న పులి, నేడు ఎలుగుబంటి రావడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story