- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు ఆందోళన చెందొద్దు.. ఇది ప్రజా ప్రభుత్వం
రైతులు ఆందోళన చెందొద్దు అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాడి శివ పేర్కొన్నారు.

దిశ, గీసుకొండ : రైతులు ఆందోళన చెందొద్దు అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాడి శివ పేర్కొన్నారు. ఊకల్ సహకార సంఘం మక్కల కొనుగోలు కేంద్రంలో గురువారం రైతులను కలిసి వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వమని.. రెండు రోజుల్లో 10 నుంచి 15 లారీలు కొనుగోలు కేంద్రానికి వస్తాయని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దాడి శివ భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రంలో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులు నిర్భయంగా ఉండండి అని, ఏ సమస్య వచ్చినా తానున్నానని సీఐ విశ్వేశ్వర్ హామి ఇచ్చారు. కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ కొమురారెడ్డి, మండల నాయకులు ఆకుల రుద్ర ప్రసాద్, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.






