- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరిధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
వరి కల్లం వద్ద నిలువ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మహముత్తారం మండలం బోర్లగూడెంలో రైతులు ధర్నా నిర్వహించారు.

దిశ, మహాముత్తారం : వరి కల్లం వద్ద నిలువ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మహముత్తారం మండలం బోర్లగూడెంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులకు మద్దతుగా కుల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీరా ఫుల్ సింగ్ నాయక్ మాట్లాడుతూ గత వారం నుంచి కల్లంలోనే వరి ధాన్యం ఉందని, లారీలను టెండర్ దారుడు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వెంటనే లారీలు సరఫరా చేయాలని కోరారు. లారీలను వెంటనే పంపాలని నినాదాలతో రైతులు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. చరవాణి ద్వారా మహముత్తారం తాసిల్దార్ దండు శ్రీనివాస్ సాయంత్రం వరకు లారీలను పంపిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నా లొ రైతులు ఠాకూర్ లక్ష్మణ్, వెంకట్రాజ్యం, బానోత్ దేవుసింగ్, ఠాకూర్ రవి, మొగిలి రమేష్, సురెడ్డి నర్సింహా రెడ్ది,శ్రీధర్, సింగన వేణి తిరుపతి, లావుడ రమేష్ తెలిపారు.






