- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబాబాద్ కలెక్టర్ పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన రైతులు
రైతుల సమస్యల పట్ల మానుకోట జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, మహిళా రైతులని కూడా చూడకుండా కేసులు పెట్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారంటూ ఆయన్ని వెంటనే బదిలీ చేయాలంటూ కేసముద్రం మండలం నారాయణపురం రెవెన్యూ పరిధిలోని రైతులు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

మహబూబాబాద్ కలెక్టర్ పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు
21 నెలలుగా రైతుల సమస్యల పట్ల కలెక్టర్ తీవ్ర నిర్లక్ష్యం
శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులపై కేసులు పెట్టారంటూ ఆగ్రహం
36 మంది రైతులపై కేసులు నమోదు
కలెక్టర్ ను బదిలీ చేయాలంటూ సీఎంకు నారాయణపురం రైతుల ఫిర్యాదు
దిశ, మహబూబాబాద్: రైతుల సమస్యల పట్ల మానుకోట జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, మహిళా రైతులని కూడా చూడకుండా కేసులు పెట్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారంటూ ఆయన్ని వెంటనే బదిలీ చేయాలంటూ కేసముద్రం మండలం నారాయణపురం రెవెన్యూ పరిధిలోని రైతులు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నారాయణపురం రెవెన్యూ పరిధిలో 2021 లో ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా 633 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారని మిగిలిన 1100 ఎకరాల్లో పట్టాలు ఉన్న నేటికీ ఆన్లైన్లో రైతు పేరు మరియు తండ్రి పేరు 'అడవి'గా నమోదై ఉందని అలాగే 11-09-2024నా ప్రభుత్వం ప్రత్యేక జీవో 94 ద్వారా సూచించినప్పటికీ ఆన్లైన్లో 300 మంది రైతులు మరియు తండ్రుల పేర్లు ఇప్పటికీ 'అడవి'గానే నమోదు కాబడి ఉన్నాయని అలాగే 2023 సంవత్సరంలో "టి.ఎం 33" కింద 145 దరఖాస్తులు సమర్పించినప్పటికీ అది కూడా జిల్లా కలెక్టర్ వద్దనే నేటికీ పెండింగ్ లో ఉన్నాయని ఈ దరఖాస్తులను పరపరిష్కరించాలంటూ కలెక్టర్ కి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ముఖ్యమంత్రికి చేసిన ఫిర్యాదులో వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఈ మధ్యకాలంలో శాంతియుత నిరసన తెలిపిన 8 మంది మహిళా రైతులతో కలిపి 36 మంది రైతులపై కేసులు పెట్టించి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఏ ఫైల్ పంపినా సర్య్కూ లర్ ఉందా జీవో ఉందా అంటూ రైతులను అవమానిస్తూ 21 నెలలుగా రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదంతో 8 ఏళ్లుగా రైతుబంధు,రైతు బీమా,పంట రుణాలు పొందకుండా 15 కోట్ల విలువైన ప్రయోజనాలను నష్టపోయామని వారు వాపోయారు. మంత్రి పొంగిలేటి సైతం హామీ ఇచ్చిన నేటికి అది కార్యరూపం దాల్చలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని నారాయణపురం గ్రామ రెవెన్యూ రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు.






