- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్యాక్స్ తో రైతులకు ఎంతో మేలు
ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతోందని పీఏసీఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి పేర్కొన్నారు.

దిశ, మరిపెడ : ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతోందని, క్రాప్ లోన్లు మొదలుకుని ఫెర్టిలైజర్స్, కొనుగోలు కేంద్రాలు, సబ్సిడీ యంత్రాలు రైతులకు సకాలంలో అందజేస్తూ వారికి చేదోడు వాదోడుగా పీఏసీఎస్ కేంద్రాలు నిలుస్తున్నాయని మరిపెడ క్లస్టర్ ప్యాక్స్ చైర్మెన్ చాపల యాదగిరి రెడ్డి అన్నారు. బుధవారం మరిపెడ మండలంలోని గిరిపురం రైతు వేదికలో 99రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏవో వీరాసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార సంఘం విధులు, వాటి ద్వారా రైతులకు జరిగే మేలుపై జిల్లా వ్యవసాయ అధికారిణి బి సరితతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-2026 ఖరీఫ్ సీజన్ లో సుమారు 1,51,031టన్నుల ధాన్యం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా చేశామని, 2668 మంది రైతుల ఖాతాల్లో బోనస్ రూ.7.55కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అలాగే రబీ సీజన్ లో ప్రస్తుతం 16కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 22,842 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. 16,014టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామన్నారు. ఖరీఫ్, రబీ రెండు పంటలకు కలిపి 5085మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ 27,453మంది రైతులకు అందించామన్నారు. మొక్కజొన్న రైతుల కొసం సహకార సంఘం ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 255మంది రైతులకు సంబంధించి 28,200 బస్తాలు కొనుగోలు చేశామన్నారు. నాడు చిన్న సంఘంగా ఉన్న సెంటర్ నేడు రూ.32కోట్లకు చేరుకుందని, రైతులకు స్ప్రేయింగ్ లో అధునాత యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నామని, అందులో భాగంగానే డ్రోన్ స్ప్రేయర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. అవసరమున్న క్లస్టర్ పరిధిలోని రైతులు 2రోజుల ముందుగానే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా దరఖాస్తు చేసుకుని వాటికి కావాల్సిన ముడి సరుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రైతులు పంట మార్పిడి చేసుకోవాలి : జిల్లా వ్యవసాయ అధికారిణి సరిత
రైతులు పంట మార్పిడి పద్దతిని పాటించాలని, తద్వారా దిగుబడులు పెరుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారిణి అన్నారు. భూ సారం కాపాడుకోకుండా ఇష్టానుసారంగా ఫెస్టిసైడ్స్ వేసుకుని సాగు చేసుకుంటుపోతే రానున్న పదేళ్లలో భూమి నిర్జివమై పోతుందన్నారు. ఒకే రకం పంటలు వేయంతో రైతులకు నష్టం కలుగుతుందని, పంట మార్పిడి ద్వారా లాభాదాయక పంటలు వేసుకోవటం ద్వారా భూసారం పెరగటంతో పాటుగా దిగుబడులు కూడా పెరుగుతాయన్నారు. అనంతరం ఏడీఏ విజయ్ చంద్రా మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి జనుము, జిలుగు విత్తనాలు అందుబాటులో ఉంటాయని రైతులు తప్పనిసరిగా భూసారం పెంచుకునేందుకు ఈ విత్తనాలు వేసుకోవాలన్నారు. భూ సారా పరీక్షలకు మల్యాల, ఖమ్మంలోని శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి అనువైన పంట వేసుకోవాలని సూచించారు. అదే విధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే బీటీ3 విత్తనాలు, గుంటురు, ఆంధ్రా నుంచి వచ్చే అన్ లైసెన్స్డ్ విత్తనాలు, మేల్ ఫీమేల్ విత్తనాలు ఎవరు కూడా వాడకూడదన్నారు. బీటీ 3 పత్తి విత్తనాల ద్వారా క్యాన్సర్ ముప్పు పొంచి ఉందన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినపుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. నేడు హన్మకొండలో జరిగే రైతు అవగాహన సభకు పరిమిత రైతులు ఉదయం 6 గంటలకు మండల కేంద్రం నుంచి బస్సు బయల్దేరి వెళ్లనుందని రైతులు పేర్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంపెళ్లి పీఏసీఎస్ చైర్మెన్ కే. లక్ష్మీ దేవి రెడ్డి, మానుకోట ఆగ్రోస్ ఆర్ ఎం వెంకన్న, పలు మండలాల ఏవోలు నర్సింహా, భాస్కర్, అనీల్, ఛాయ రాజ్, వాహిణి, గిరిపురం సర్పంచ్ బాదవత్ నీలా సైదులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.






