- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కజొన్న కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతుల ఆందోళన
మొక్కజొన్న కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గూడురు మండల కేంద్రం వద్ద రైతుల ఆందోళన చేపట్టారు.

దిశ, గూడూరు : మొక్కజొన్నలు కొనుగోలు లో జాప్యం లేకుండా త్వరగా కొనుగోలు చేయాలని కోరుతూ జాతీయ రహదారి 365 పై ఆందోళనకు దిగిన రైతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన మొక్కజొన్న రైతులు గత కొద్ది రోజులుగా మొక్కజొన్నను తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన గోనె సంచుల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం రైతులు అధిక సంఖ్యలో మొక్కజొన్నను సాగు చేయడంతో కొనుగోలు కేంద్రానికి భారీ సంఖ్యలో మక్కలు రావడంతో అధికారులకు సమస్య గా మారింది కొనుగోలు కేంద్రాల వద్ద గోనె సంచుల కోసం నిరీక్షణ చేయవలసి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మక్కలు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి చాలా రోజులు అవుతున్న కాంటాల విషయంలో కూడా అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పైరవీలు చేసిన వారికే గోనే సంచులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పంట వేసే ముందు యూరియా బస్తాల కోసం ధర్నాలు చేశామని పంట చేతికి వచ్చాక అమ్ముకోవడానికి కూడా ఇలా ఆందోళన చేయవలసి వస్తుందని రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. గోనె సంచులు ఇప్పించి త్వరగా కాంటాలు అయ్యే విధంగా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి రైతులు సొసైటీ కార్యాలయానికి పోలీసులతో కలిసి వెళ్లారు.






