విద్యుత్ షాక్ తో రైతు మృతి..

by Taduka Kalyani |

విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం పాలైన ఘటన కేసముద్రం మండలం బేరువాడ గ్రామంలో ఆదివారం జరిగింది.

విద్యుత్ షాక్ తో రైతు మృతి..
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం పాలైన ఘటన కేసముద్రం మండలం బేరువాడ గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ తిరుపతి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జూకంటి గట్టుమల్లు(51) ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లగా, విద్యుత్ మోటారు పనిచేయకపోవడంతో విద్యుత్ మోటారుకు మరమ్మత్తు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు.

Next Story