గుండెపోటుతో వ్యవసాయ కూలీ మృతి.. కొత్తగూడలో విషాదం

by Bhanu |

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామంలో శనివారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీగా జీవిస్తున్న రూపురెడ్డి బాపురెడ్డి (56) అనే వ్యక్తి, పొలానికి నారు పంచేందుకు వెళ్తున్న సమయంలో

గుండెపోటుతో వ్యవసాయ కూలీ మృతి.. కొత్తగూడలో విషాదం
X

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామంలో శనివారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీగా జీవిస్తున్న రూపురెడ్డి బాపురెడ్డి (56) అనే వ్యక్తి, పొలానికి నారు పంచేందుకు వెళ్తున్న సమయంలో గుండెపోటుతో అక్కడికక్కడే మరణించారు.

గ్రామస్థుల కథనం ప్రకారం.. బాపురెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలానికి నాటు పనులకు వెళ్లారు. నడుచుకుంటూ పొలానికి వెళ్తుండగా మార్గ మధ్యలో తీవ్ర ఆయాసంతో వరం పక్కన కూర్చున్నారు. అప్పటికే కళ్ళు తిరుగుతున్నాయంటూ తోటి కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఇంటికి వెళ్లమని సూచించగా, "వెళ్తాను తర్వాత" అన్న వెంటనే కిందపడిపోయారు. స్పందించేలోపే ఆయన మృతి చెందారు.

ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుండటంతో రైతులు, కూలీలు చేలకు పరుగులు పెడుతుండగా, ఓ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ చలాకీగా వ్యవసాయ పనుల్లో ఉండే బాపురెడ్డి మృతి గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురి చేసింది.


అతివృష్టినా.. అనావృష్టినా రైతుకే నష్టం.. ఏదో కాస్త వర్షాలు పడుతున్నాయి కదా.. అని రైతన్నలు పార పలుగు పట్టుకొని చేల బాట పట్టారు. పొలం దున్నడం.. నాటు వేయడంలో ఎప్పుడూ వ్యవసాయ కూలీ పనులు చేసి జీవించే ఓ రైతు ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story