కుటుంబ కలహాలతో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

by Bhanu |

కుటుంబ కలహాలతో క్షిణాకవేశంలో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దుగ్గొండి మండలం స్వామి రావు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

కుటుంబ కలహాలతో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
X

దిశ, దుగ్గొండి: కుటుంబ కలహాలతో క్షిణాకవేశంలో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దుగ్గొండి మండలం స్వామి రావు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వామి రావు పల్లి గ్రామానికి చెందిన గైకొటి రమ కుటుంబ సభ్యుల ఆస్తి తగాదాలకు చెందిన పంచాయతీ బుధవారం మధ్యాహ్నం స్వామిరావుపల్లి గ్రామంలో జరిగగా వారికి చెందిన 20 గుంటల భూమి పంచాయతీ విషయంలో పెద్ద మనుషులు తమకు అన్యాయం చేస్తున్నారనే విషయంతో చినికావేశంలో రమ ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న గైకోటి రాజు వ్యవసాయ భూమిలోకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న దుగ్గొండి పోలీసులు, ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు, ట్రైనింగ్ ఎస్సై శివరాత్రి మహేష్ వ్యవసాయ భూమిలో నీరు ఎక్కువగా ఉండటంతో బావిలో రెండు మోటర్లు పెట్టి నీరు బయటకు తోలే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్టి విషయమై స్థానిక ఎస్సైని సంప్రదించగ మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంకా ఎటువంటి దరఖాస్తు అందలేదని దరఖాస్తు అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.



Next Story