- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్డంగా బుక్ అయిన నకిలీ పోలీస్
జనగామలో నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. కానిస్టేబుల్ కుమారస్వామిని ( కిరణ్) అంటూ చెలామణీ అవుతూ కొన్ని రోజుల

దిశ, జనగామ: జనగామలో నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. కానిస్టేబుల్ కుమారస్వామిని ( కిరణ్) అంటూ చెలామణీ అవుతూ కొన్ని రోజుల నుండి పబ్బం గడుపుకున్న నకిలీ కేటుగాడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పెంబర్తి నెల్లుట్ల హైవే నుంచి వెళ్తున్న వాహనం నుంచి ఈ కేటుగాడు నగదు దోచుకున్నట్టు సమాచారం. జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఒక కేసు విషయంలో రూ..2,50,000 నగదు రూపంలో ఇవ్వాలని బేరసాలు నడిపించారన్నారు. అన్వర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో నకిలీ కానిస్టేబుల్ వ్యవహారం వెలుగుచూసిందని తెలిపారు.
వెంటనే నకిలీ కానిస్టేబుల్ అయిన కిరణ్ ను అదుపులోకి తీసకున్నట్లు తెలిపారు. అతని వద్ద మొబైల్ ఫోన్, నకిలీ ఐడి కార్డ్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పోలీస్ శాఖలో గత కాలం ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన జనగామ సిఐ పి.సత్యనారాయణ రెడ్డి, ఎస్సై భరత్, కానిస్టేబుల్ కరుణాకర్ ,సాగర్, కృష్ణ, చరణ్, రాజేష్, మధుసూదన్, వారిని డీసీపీ రాజమహేంద్ర నాయక్, జనగామ ఏసిపి , వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సిపి) అభినందించారు.






