ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పాడి గేదెల పథకానికి ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు

by Ratna Kumari |

జిల్లా షెడ్యూల్డ్ కులముల‌ సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటేడ్ మహబూబాబాద్ జిల్లా ద్వారా 2025-26 సంవ‌త్స‌రానికి సంబంధించి పాడి గేదెల పథకానికి ఆన్ లైన్ దరఖాస్తు ఈనెల 16 న ముగిసిన విష‌యం తెలిసిందే.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పాడి గేదెల పథకానికి ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : జిల్లా షెడ్యూల్డ్ కులముల‌ సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటేడ్ మహబూబాబాద్ జిల్లా ద్వారా 2025-26 సంవ‌త్స‌రానికి సంబంధించి పాడి గేదెల పథకానికి ఆన్ లైన్ దరఖాస్తు ఈనెల 16 న ముగిసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం గడువు తేదీని 23 వరకు పొడిగించిన‌ట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి అధికారి కె.శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాల‌కు చెందిన యువతీ / యువకులు సంబందిత కుల దృవీకరణ పత్రం (తెలంగాణా ఏర్పడిన తరవాత జారీ చేసింది), ఆదాయ ధృవీకరణ పత్రం (మీసేవ ద్వారా జారీ చేసింది). ఆధార్ కార్డు, రేషన్ కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డు, పాస్ పోర్ట్ సైజు పోటో, సదరం సర్టిఫికేట్ (వికలాంగుల కోసం) మరియు పట్టాదారు పాసు పుస్తకం (కనీసం 0.10 గుంటలు), దృవ పత్రాలతో తేది 23-04-2026 వరకు ఆన్ లైన్ (www.tgobmms.cgg.gov.in) లో దరఖాస్తు చేసుకొని, వెంటనే ఆ ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధిత దృవ పత్రాలను జత పరిచి (హార్డ్ కాపీ), (గ్రామీణ ప్రాంతం వారు సంబంధిత ఎంపీడీవో కార్యాలయము లో, పట్టణ ప్రాంతం వారు సంబంధిత మున్సిపాలిటీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా అర్హులైన ల‌బ్ధిదారుల‌కు 2 పాడి గేదెల‌ను అందించ‌నున్న‌ట్టు తెలిపారు.

Next Story