ఎస్సీ కార్పొరేష‌న్ ద్వారా స్వ‌యం ఉపాధి ప‌థ‌కాల‌కు గడువు పెంపు

by Nallavelli.Anjaneyulu |

ఎస్సీ కార్పొరేష‌న్ ద్వారా స్వ‌యం ఉపాధి ప‌థ‌కాల‌కు గడువు ఏప్రిల్ 02, 2026 వ‌ర‌కు పెంచిన‌ట్టు ఎస్సీ కార్పొరేష‌న్ నిర్వాహ‌క సంచాల‌కులు కే.శ్రీనివాస‌రావు ప్ర‌క‌ట‌న లో తెలిపారు.

ఎస్సీ కార్పొరేష‌న్ ద్వారా స్వ‌యం ఉపాధి  ప‌థ‌కాల‌కు గడువు పెంపు
X

దిశ‌, మ‌హ‌బూబాబాద్ టౌన్ : జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా స‌హ‌కార అభివృద్ధి సంఘం మ‌హ‌బూబాబాద్ జిల్లా ద్వారా 2025-26 సంవ‌త్స‌రానికి స్వ‌యం ఉపాధి ప‌థ‌కాల కోసం ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మార్చి 24, 2026 వ‌ర‌కు చివ‌రి తేది ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ గ‌డువును ఏప్రిల్ 02, 2026 వ‌ర‌కు పొడ‌గించిన‌ట్టు తెలిపారు. ఈ ప‌థ‌కానికి అర్హులైన షెడ్యూల్డ్ కులములకు చెందిన యువతీ/యువకులు సంబందిత కుల, ఆదాయ, నివాస దృవీకరణ పత్రాలు, ఆదార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ సైజు పోటో, పట్టాదారు పాసు పుస్తకం (వ్యవసాయ రంగం యూనిట్లకు), శాశ్వత డైవింగ్ లైసెన్సు (రవాణా రంగం యూనిట్లకు) తదితర ధృవ‌ పత్రాలతో 02-04-2026 వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. పూర్తి వివరాల కోసం (www.tgobmms.cgg.gov.in), వెబ్ సైట్ ని సందర్శించగలరు.

Next Story