కాటారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సేవలు భేష్

by velandi.Saikiran |

ప్రాథమిక వ్యవసాయ సహకార రంగంలో కాటారం సహకార సంఘం చేస్తున్న సేవలు భేష్ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కితాబిచ్చారు.

కాటారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సేవలు భేష్
X

దిశ, కాటారం : ప్రాథమిక వ్యవసాయ సహకార రంగంలో కాటారం సహకార సంఘం చేస్తున్న సేవలు భేష్ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కితాబిచ్చారు. సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల లో అన్ని విభాగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన సీఈఓ ఎడ్ల సతీష్, కు జిల్లా కలెక్టర్ ఉత్తమ సేవ అవార్డు అందజేశారు. సహకార సంఘం సీఈఓ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ఉత్తమ సంఘం గా సేవలు అందించడానికి ముందుండి నడిపిన సంఘ అధ్యక్షులు తోటపల్లి ప్రశాంత్, మరియు సంఘ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతు సోదరులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ జిల్లా సహకార అధికారి వాల్యా నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story