ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

by Ratna Kumari |

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు.

ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌లో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
X

దిశ‌, ఎల్క‌తుర్తి : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద అధికారులు ప్రజాప్రతినిధులకు దిశ నిర్దేశం చేశారు. చేపట్టాల్సిన అంశాలు అభివృద్ధి కార్యక్రమాలపై సర్పంచ్ లు , పంచాయతీ సెక్రటరీలు, అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌తి గ్రామంలో పరిసరాల పరిశుభ్రత నిర్వహించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్ చేయాలి. వైద్య ఆరోగ్యశాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలీ ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేసుకోవాలి. ఎల్కతుర్తి మండలంలో కాకతీయ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తుంది. పోలీస్, రవాణా శాఖ అరైవ్ అలైవ్ సురక్షితంగా చేరుకోవడం కార్యక్రమాన్ని చేయాలి.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు గృహ నిర్మాణ శాఖ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, లబ్ధిదారులు ఎంపిక చేయాలి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న వారు గృహ ప్రవేశాలు నిర్వహించాలని తెలిపారు. పనులు నెమ్మదిగా ఉన్న వాటివి వేగంగా అయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ వారు పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలి. వ్యవసాయ రెవెన్యూ ఇరిగేషన్, విద్యుత్ శాఖ వారు రైతు సంక్షేమం కార్యక్రమాలు చేపట్టాలి. విద్య శాఖవారు విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించాలి. డ్రాప్ ఔట్ తగ్గించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని.. యువజన, క్రీడల శాఖ వారు యువత క్రీడలకు సంబంధించిన అంశాలను చేపట్టాలన్నారు. క్రీడ‌లు నిర్వ‌హించాల‌ని, మ‌హిళా, సంక్షేమ శాఖ సెర్ఫ్, మెప్మా వారు మహిళలల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. పర్యావరణం అటవీ శాఖ వారు పర్యావరణం కాలుష్య నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలి. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలి.. వర్షాకాలంలో మొక్కలు నాటాలి స్టీల్ బ్యాంక్ వినియోగం పెంచాలి. గ్రామాల్లో వేసవి కాలంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.


డ్రింకింగ్ వాటర్ ఇబ్బందులు లేకుండా అవసరమున్న చోట బోర్ వేల్ రిపేర్ చేయించడం, వాటర్ సోర్స్ ఎక్కడ ఉన్న ఉపయోగించుకోవాలి.. సర్పంచ్ లు, ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులు అన్ని తాగునీటి వనరులు పరిశీలించి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్కతుర్తి మండల హెల్త్ క్యాంప్ పై సెక్రటరీ లు ప్రత్యేక దృష్టి పెట్టీ ప్రతి ఒక్కరి హెల్త్ ఫ్రొఫైల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ అధికారులు మీటింగ్ వినకుండా బయట ముచ్చట్లు పెడుతుండడంతో వారిని పిలిచి ఇంతసేపు దేనిమీద అవగాహన కార్యక్రమం జరిగిందో చెప్పాలని కోరారు. ఎవరు సరిగా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాక‌ర్. ఇది మంచి పద్ధతి కాదు.. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ బయట ముచ్చట్లు పెట్టడం ఏంటి అని ఛీవాట్లు పెట్టారు. వీరందరికీ షోకాజ్ నోటీసు ఇవ్వాలని అర్చన కలెక్టర్ కి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునిగడప లావణ్య శేషు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుక్కిన సంతాజి, సర్పంచ్ లు పాల్గొన్నారు.

Next Story