- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఆడబిడ్డ ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి
రైతు హక్కుల కోసం చాకలి ఐలమ్మ గారు సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమన అన్నారు.

ప్రతి ఆడబిడ్డ ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి
- పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
దిశ,పాలకుర్తి : రైతాంగ హక్కుల కోసం కష్టాలనెదుర్కొని అణగారిన వర్గాల గౌరవాన్ని నిలబెట్టిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతు హక్కుల కోసం చాకలి ఐలమ్మ గారు సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని,సమాజంలో ఉన్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొని, భూస్వాముల అణచివేతకు ప్రతిఘటించి చరిత్రలో నిలిచారని,సమానత్వం కోసం చేసిన ఆమె పోరాటం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ,మండల అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి,మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత,పాలకుర్తి ఏఎంసీ చైర్మెన్ మంజుల నాయక్,పార్టీ సీనియర్ నాయకులు,మహిళా నాయకురాళ్లు,యువజన నాయకులు,పార్టీ శ్రేణులు,ఐలమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






