భారీ వ‌ర్షానికి తెగిన మ‌ట్టి రోడ్డు.. ఇప్పుడే ఇలా..వ‌ర్షాకాలంలో ఎలా..?

by Bhanu |

ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో మంగ‌ళ‌వారం రోజున రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి ఏటూరునాగారం మండ‌లం దోడ్ల-మ‌ల్యాల గ్రామాల మ‌ధ్య గ‌ల జంప‌న్న వాగుపై నిర్మించిన తాత్క‌లిక మ‌ట్టి రోడ్డు వ‌ర‌ద ప్రవాహానికి తెగిపోయింది.

భారీ వ‌ర్షానికి తెగిన మ‌ట్టి రోడ్డు.. ఇప్పుడే ఇలా..వ‌ర్షాకాలంలో ఎలా..?
X

దిశ‌, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో మంగ‌ళ‌వారం రోజున రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి ఏటూరునాగారం మండ‌లం దోడ్ల-మ‌ల్యాల గ్రామాల మ‌ధ్య గ‌ల జంప‌న్న వాగుపై నిర్మించిన తాత్క‌లిక మ‌ట్టి రోడ్డు వ‌ర‌ద ప్రవాహానికి తెగిపోయింది. దీంతో మల్యాల, కొండాయి, ఐలాపూర్ గ్రామాల‌కు ర‌వాణా సౌక‌ర్యాలు నిలిచి పోయాయి అయితే విష‌యం తెలుసుకున్న కాంగ్రెస్ మండ‌ల పార్టీ నాయ‌కులు ఈ విష‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకు వెళ్ల‌డంతో జిల్లా క‌లెక్ట‌ర్ అదేశాల మేర‌కు ఏటూరునాగారం ఏంపీవో కూమార్‌ తాత్క‌లిక ర‌వాణా కోసం మ‌ల్యాల జంప‌న్న వాగు వ‌ద్ద ఏయిర్‌బోట్‌(గాలి ప‌డ‌వ‌) ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండ‌గా.. భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున ముందు ముందు జంప‌న్నవాగు పై అత్య‌వ‌స‌ర ప్ర‌యాణం చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని, అత్య‌వ‌స‌రంగా వైద్య సేవ‌లు సైతం అందే ప‌రిస్థితి ఉండ‌దు అన్న విష‌యాన్ని కాంగ్రెస్ మండ‌ల నాయ‌కులు మంత్రి సీత‌క్క దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విష‌యం పై స్పందించిన మంత్రి సీత‌క్క మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు కురిసి జంప‌న్న వాగులో వ‌ర‌ద ప్ర‌వాహం నెల‌కొన్న మ‌ల్యాల‌,కొండాయి,ఐలాపూర్ గ్రామాల‌కు ప్ర‌యాణం కోన‌సాగే విధంగా కొండాయి నుండి ఊర‌ట్టం వ‌ర‌కు గ‌ల రహ‌దారి పై చిప్స్‌,డ‌స్ట్ పోసి ర‌వాణా కోన‌సాగేలా చ‌ర్య‌లు చేప‌ట్టడం జ‌రుగుతుందని మంత్రి సీత‌క్క తెల‌పార‌ని కాంగ్రెస్ మండ‌ల పార్టీ నాయ‌కులు తెలిపారు.

ఇప్పుడే ఇలా..వ‌ర్ష‌కాలంలో ఎలా..

జంప‌న్న వాగు పై నిర్మించిన బ్రిడ్జి గ‌త రెండు సంవత్సరాల క్రితం వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయింది. అప్ప‌టి నుండి వ‌ర్షాకాలంలో కొండాయి,మ‌ల్యాల‌,ఐలాపూర్ గ్రామాల ప్ర‌జ‌లు ర‌వాణా సౌక‌ర్యం కోసం అవ‌స్థ‌లు ప‌డుతూనే ఉన్నారు. అయితే ఈ సంవ‌త్సరం ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన మిని మేడారం జాత‌ర సంద‌ర్బంగా ఈ వాగు పై తాత్క‌లికంగా మ‌ట్టి రోడ్డు నిర్మించారు. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు కురిసిన వ‌ర్షాల కార‌ణంగా జంప‌న్న‌వాగు పై నిర్మించిన మ‌ట్టి రోడ్డు వ‌ర‌ద ప్ర‌వాహంలో రెండు సార్లు కొట్టుకుపోయింది. ఇదీలా ఉండ‌గా పూర్తిగా వ‌ర్ష‌కాలం స‌మ‌యం రాకముందే అడ‌ప‌ద‌డ‌ప కురుస్తున్న వ‌ర్షాల‌కే త‌మ గ్రామాలకు ర‌వాణా ప‌రిస్థితి ఇలా ఉంది అంటే రానున్న వ‌ర్షాకాలంలో త‌మ గ్రామాల ప‌రిస్థితి ఏలా ఉంటుందో అని దోడ్ల,మ‌ల్యాల‌,కొండాయి గ్రామాల ప్ర‌జ‌లు అందోళన చెందుతున్నారు.

Next Story