ఊయ‌ల‌లా ఊగుతున్న విద్యుత్ స్తంభాలు

by Nallavelli.Anjaneyulu |

విద్యుత్ అధికారుల నిర్లక్షం.. పరాకాష్టకు చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదని మనుగొండ చిన్న కెనాల్ సమీపంలోని కరెంట్ స్తంభాలు చూస్తే స్ప‌ష్టంగా అర్ధం అవుతుంది.

ఊయ‌ల‌లా ఊగుతున్న విద్యుత్ స్తంభాలు
X

దిశ, గీసుకొండ : విద్యుత్ అధికారుల నిర్లక్షం.. పరాకాష్టకు చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదని మనుగొండ చిన్న కెనాల్ సమీపంలోని కరెంట్ స్తంభాలు చూస్తే స్ప‌ష్టంగా అర్ధం అవుతుంది. మనుగొండ నుంచి గీసుకొండ మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో గ్రావిటీ కాలువకు ఇరు వైపులా ఏర్పాటు చేసిన 11 కేవీ కరెంట్ స్తంభాలు ఊయ‌ల‌లా ఊగుతున్నాయి. నిత్యం పశువులు పొలాలలో మేపడానికి రైతులు తీసుకురావడం, రోడ్డుపైన బాట సారులకు, వాహనదారులకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే భారి ప్రాణ నష్టం ఏర్పడే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కు అతి సమీపంలో ఉన్న కరెంట్ స్తంభాలు అధికారులకు కనిపించడం లేదా అని మండిపడుతున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు నిర్లక్షం వీడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story