వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య

by Bhanu |

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో విషాదం నెలకొంది.

వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో విషాదం నెలకొంది. గత నాలుగు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తోర్రికొండ రాజవ్వ (76) అనే వృద్ధురాలు ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. తన ఆరోగ్యం మెరుగుపడదనే బెంగతో మనస్థాపానికి గురైన ఆమె, గ్రామంలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది.


మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు మానకొండూరు సీఐ సంజీవ్ కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అన్నారం గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మృతురాలికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Next Story