- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రాలు వస్తాయనే నెపంతో వృద్ధ దంపతులపై దాడి
పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బాల్య వెంకటయ్య, లచ్చమ్మలపై మంత్రాలు చేస్తున్నారనే నెపంతో దాడి జరిగిందని వారి కుమారుడు రాజు ఆరోపించారు.

దిశ, పర్వతగిరి: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బాల్య వెంకటయ్య, లచ్చమ్మలపై మంత్రాలు చేస్తున్నారనే నెపంతో దాడి జరిగిందని వారి కుమారుడు రాజు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే, గ్రామస్తులైన ఎల్లమ్మ ఆమె కుమారుడు రాజు, కుమార్తె జ్యోతి కలిసి తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని, గతంలో కూడా తమపై అక్రమ కేసులు పెట్టించారని, ప్రత్యేకించి తాను పోస్టల్ డిపార్టుమెంట్లో పనిచేస్తున్న సమయంలో తనపై తప్పుడు ప్రచారాలు చేసి పరువు తీశారని రాజు పేర్కొన్నారు.
ఇది కక్షపూరిత చర్యగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తండ్రిపై లేనిపోనివి అభియోగాలు మోపుతూ మంత్రాలు చేస్తున్నారనే ఆరోపణలతో ఇంటిపై దాడికి తెగబడారని, తానూ ఇంట్లో ఉన్న సమయంలో ‘బయటికి రారా’ అంటూ బెదిరింపులకు గురయ్యానని, భయభ్రాంతులకు లోనయ్యానని రాజు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు స్పందించిన ఎస్సై ప్రవీణ్ మాట్లాడుతూ, ఇరుపక్షాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, విచారణ జరిపిన అనంతరం కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.






