- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలను మోసం చేసేందుకే స్థానిక ఎన్నికల షెడ్యూల్
ఎవరిని మోసం చేద్దామని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

దిశ, కమలాపూర్: ఎవరిని మోసం చేద్దామని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన ప్రకటనపై బిజెపి పార్టీ సంపూర్ణంగా మద్దతి ఇవ్వడమే కాకుండా హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నామన్నారు.
స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ తప్పులు తడకగా ఉందని మండిపడ్డారు. కోర్టు డిక్లరేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని సూచించారు. రెండు సంవత్సరాలుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలు వల్లకాడుగా మారాయని పేర్కొన్నారు. తక్షణం ఎన్నికలు జరిపించి గ్రామాల్లో ప్రజల సౌకర్యాలు కల్పించాలని చెప్పామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆశావాహులు ఖర్చులు చేసి ఇబ్బందులు పడకూడదని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి కోర్టు డిక్లరేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.






