- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుగ్గొండి ఎస్సై గా రణధీర్ బాధ్యతల స్వీకరణ..
దుగ్గొండి మండల నూతన ఎస్సైగా ఆదివారం రావుల రణధీర్ బాధ్యతలు స్వీకరించారు.

దిశ, దుగ్గొండి : దుగ్గొండి మండల నూతన ఎస్సైగా ఆదివారం రావుల రణధీర్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకుముందు వరంగల్ ట్రాఫిక్ ఎస్సై గా విధులు నిర్వహించారు. దుగ్గొండి ఎస్సైగా ఉన్న నీలోజు వెంకటేశ్వర్లు ఇంతేజర్ గంజ్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై రణధీర్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులకు సమన్యాయం అందిస్తానని తెలిపారు.
సమస్యలు పరిష్కరిస్తూ.. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. భాద్యతలు స్వీకరించిన ఎస్సైకి హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్లు కుమారస్వామి, రంజిత్ కుమార్, శేఖర్, రాకేష్, రాజ్ కుమార్, సరిత, శిరీష, వేణు, రాజు, సాయి కుమార్, పూర్ణ చందర్ పుషగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.






