- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ ‘ఉత్తమ ప్రిన్సిపల్’ అవార్డు అందుకున్న డాక్టర్ మల్లం నవీన్
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లం నవీన్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి “ఉత్తమ ప్రిన్సిపల్” అవార్డు అందుకున్నారు.

దిశ, హన్మకొండ టౌన్: కాకతీయ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రిన్సిపల్ డాక్టర్ మల్లం నవీన్ రాష్ట్ర స్థాయి “ఉత్తమ ప్రిన్సిపల్” పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – విద్యా వారోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం రూ.1 లక్ష ప్రోత్సాహక నిధి, రూ.10 వేల నగదు బహుమతిని కూడా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లం నవీన్ మాట్లాడుతూ... ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయమే కాకుండా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపని తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం.. డాక్టర్ మల్లం నవీన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.






