మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పై కేసు నమోదు

by Bhanu |

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా డోర్నకల్ పట్టణ కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పై కేసు నమోదు
X

దిశ, డోర్నకల్: రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా డోర్నకల్ పట్టణ కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ శ్రేణులతో కలిసి గాంధీ బొమ్మ కూడలిలో కాంగ్రెస్ వేదిక మీదుగా ప్రదర్శన జరిపారు. తొలుత పోలీసుల సూచనలను అతిక్రమించి బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగి విధులకు ఆటంకం కలిగించినట్లు తెలిపారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైనట్లు సీఐ రాజేష్ నాయక్ పేర్కొన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో సహా 17 మందిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మరికొంత మందిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.

Next Story