బీఆర్ఎస్ జెండా గద్దెపై కాంగ్రెస్ స్టేజీ.. వేడుకలు సజావుగా సాగేనా..?

by Bhanu |

రాష్ట్రమంతా అవతరణ వేడుకలకు సిద్దమవుతుంటే.. డోర్నకల్లో మాత్రం అవతరణ వేడుకలు వివాదానికి దారితీస్తున్నాయి. జూన్ 2వ తేదీన ప్రభుత్వం, ప్రతిపక్షాలు రాష్ర్ట అవతరణ వేడుకల నిర్వహన ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి.

బీఆర్ఎస్ జెండా గద్దెపై కాంగ్రెస్ స్టేజీ.. వేడుకలు సజావుగా సాగేనా..?
X

దిశ, డోర్నకల్: రాష్ట్రమంతా అవతరణ వేడుకలకు సిద్దమవుతుంటే.. డోర్నకల్లో మాత్రం అవతరణ వేడుకలు వివాదానికి దారితీస్తున్నాయి. జూన్ 2వ తేదీన ప్రభుత్వం, ప్రతిపక్షాలు రాష్ర్ట అవతరణ వేడుకల నిర్వహన ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. అందులో భాగంగానే గ్రామాల నుంచి మొదలుకొని జిల్లాల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల్లో గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటుతో కార్నర్ సభలను నిర్వహిస్తోంది.


ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ వేడుక ఏర్పాట్లు డోర్నకల్లో వివాదానికి తెర లేపుతున్నాయి. జూన్ 2న జరగబోయే రాష్ర్ట అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముత్యాలమ్మ గుడి సెంటర్ల అవరణంలో జాతీయ జెండాలతో పాటు తమ పార్టీ జెండాలను ఎగరేసేందుకు సిద్దమౌతున్నారు. అయితే.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గులాబి జెండాను ఎగరేసేందుకు గద్దెను ఎర్పాటు చేయగా అదే స్థానంలో జెండా గద్దెకు అడ్డంగా కాంగ్రెస్ నాయకులు స్టేజీని ఏర్పాటు చేశారు.


విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఎవ్వరి అనుమతి తీసుకోని గద్దె ఏర్పాటు చేశారని, గతంలో తమ గద్దెలను సైతం ఓ పెద్ద బీఆర్ఎస్ నాయకుడు కూలగొట్టలేదా అంటూ. కాంగ్రెస్ నాయకులు తమ వాదన వినిపిస్తున్నట్లు సమాచారం. అతిరథ మహారథులు హాజరవుతున్నారన్న నేపథ్యంలో ఈ వివాదం ఎటుదారితీస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరో వైపు అవతరణ వేడుకల కోసం ఇరు పార్టీలు భారీగ జన సమీకరణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story