- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మంత్రి మాటలు నమ్మి మోస పోకండి : డా జాడి రామరాజు నేత
ఆ మంత్రి మాటలు నమ్మి మోస పోకండి అని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత పేర్కొన్నారు.

దిశ, ఏటూరు నాగారం : ఆ మంత్రి మాటలు నమ్మి మోస పోకండి అని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఆమోదం పొందకుండా అడుగు అడుగున అడ్డుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్న పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మాటలు నమ్మి ఏటూరునాగారం మండలం లోని ఆదివాసీ దళిత బహుజన, మైనార్టీ ప్రజలు మేధావులు ప్రజాసంఘాల నాయకులు ఒక్కసారి అలోచించి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ని నిలదీయ్యాలని అన్నారు. అదేవిదంగా నాడు ఎమ్మెల్యే గా ఉండగా.. రెవెన్యూ డివిజన్ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లెటర్ ఇచ్చిన నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి రెవెన్యూ డివిజన్ ప్రకటన చేసి జీవో రిలీజ్ చేసినప్పటికి ఆమోదం ఎందుకు పొందడం లేదో మంత్రి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా ఏటూరునాగారం లో ఉన్న కాంగ్రెస్ నాయకులు జెండాలు మొయ్యడానికి పరిమితం కాకుండా ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఆమోదం పొందే విదంగా మంత్రి పై ఒత్తిడి తేవాలని అన్నారు. అదేవిదంగా ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ తో పాటు ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ ని మున్సిపాలిటీ గా ప్రకటించే వరకు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






