దానంగా ఇచ్చిన భూమిని కాపాడాలి

by Elthuri vijay kumar |

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు కాలనీవాసుల వినతి

దానంగా ఇచ్చిన భూమిని కాపాడాలి
X

దానంగా ఇచ్చిన భూమిని కాపాడాలి

- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు కాలనీవాసుల వినతి

- స్థలాన్ని కాపాడడమే కాకుండా కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తానన్న ఎమ్మెల్యే

దిశ, చిట్యాల : చిట్యాల మండల కేంద్ర శివారు రాంనగర్ కాలనీకి చెందిన ఎస్సీ కాలనీవాసులు తమకు దానంగా ఇచ్చిన భూమిని కాపాడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బీరవోలు పాపిరెడ్డి తన భూములను విక్రయిస్తుండగా, కాలనీకి చెందిన ఆరేపల్లి ఆగయ్య, కటుకూరి నరసయ్య, ఆరేపల్లి అంకుష్, మరికొందరు గ్రామ పెద్దలు ఆయన వద్ద వెట్టిచాకిరి చేసి 10 గుంటల భూమిని తమ కాలనీకి దానంగా ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని ఆధారాలతో పోలీస్ స్టేషన్‌లోనూ సమర్పించినట్లు కాలనీవాసులు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తహసీల్దార్‌కు ఫోన్ చేసి దానం ఇచ్చిన భూమిపై సమగ్ర విచారణ జరిపి బౌండరీ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆ స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కాలనీ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్, తహసీల్దార్‌లకు ఫార్వర్డ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తమ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు కటుకూరి నరసయ్య, ఆరేపల్లి అంకుష్, దాసరపు సాంబయ్య, మహిళలు ముత్యాల వినోద, లక్ష్మి, శీలపాక సర్వే, శీలపాక లక్ష్మి, దాసరపు భాగ్యమ్మ, ఏకు సమ్మక్క, ముత్యాల లక్ష్మిలతో పాటు సుమారు 50 మంది మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Next Story