- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదా : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదా అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. హన్మకొండలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు.

దిశ, వరంగల్ బ్యూరో : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదా అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. హన్మకొండలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి 54 ఎకరాల స్థలాన్ని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తీసుకున్నారన్నారు. సీనియర్ శాసన సభ్యునిగా ఉన్న హరీశ్ రావు దుష్ప్రచారాలు చేయడం సబబు కాదన్నారు. వరంగల్ ప్రజలను ఇంక ఎన్ని సార్లు మోసం చేస్తారన్నారు. పర్యటనలో పేరుతో 10 ఏళ్ళు పబ్బం గడించింది మీరే కదా అన్నారు.
పదిహేను ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న మాజీలు అందరూ కాజీపేటకు చేసింది ఎంటో చెప్పాలన్నారు. పేదల ప్రజల పాలిట శాపంగా తెచ్చిన ఎన్నో పనులకు కేంద్రంతో కలిసి నడించింది మీరే కదా అన్నారు. నోట్ల రద్దు,జిఎస్టీ పన్ను,వ్యవసాయ చట్టాలకు దేశంలో మొదటగా అసెంబ్లీలో తీర్మానాలు చేసింది మీరే కదా అని అన్నారు. విభజనకు చట్టంలో సోనియా గాంధీ పొందు పరిచిన హామీలను ఎందుకు అమలు చేయలేదన్నారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కు కర్మాగారం,ట్రైబల్ యూనివర్సిటీ లను 10 ఏళ్లలో ఒక్కరోజైనా కేంద్రంతో మాట్లాడారా అని ప్రశ్నించారు. కాజీపేటకు 30 పడకల దవాఖానా ఆవశ్యకత ఉన్నప్పటికీ కనీసం ప్రయత్నాలు చేయని దద్దమ్మలు మీరు అన్నారు. కాజీపేట రైల్వే ఉద్యోగులకు స్థానికత క్రమంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికంగా మేము,అన్ని వర్గాల వారు డిమాండ్ చేస్తున్నామన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మా హయాంలో కాజీపేటకు బస్ స్టాండ్ నిర్మాణం కోసం స్థలాన్ని ఏర్పాటు చేస్తూ,మధ్యలో ఆగిన కాజీపేట ఆర్వోబి పూర్తి చేయడం,నగరని మాస్టర్ ప్లాన్,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,విమానాశ్రయం నిర్మాణం వంటి పనులను చేపట్టడం జరిగిందన్నారు.






